అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు తప్పవు..!

by Shyam |   ( Updated:2020-09-05 03:36:19.0  )
అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు తప్పవు..!
X

దిశ, నారాయణఖేడ్ : సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలంలోని పలు గ్రామాల్లో నిర్మాణంలో ఉన్న రైతు వేదిక స్థలాన్ని జిల్లా కలెక్టర్ హన్మంతరావు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. అదే సమయంలో రైతు వేదిక ముఖద్వారాన్ని బిగిస్తుండడంతో కలెక్టర్ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. రైతు వేదిక నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత కాంట్రాక్టర్‎కు సూచించారు. నాణ్యత ప్రమాణాల విషయంలో ఏ మాత్రం తగ్గకూడదని కలెక్టర్ హన్మంతరావు స్పష్టం చేశారు. ఇసుక విషయంలో సంబంధిత అధికారులకు ఫోన్ ద్వారా మందలించారు.



Next Story