- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
పెండింగ్ ఈ-చలాన్లను చెల్లించిన ఏసీపీ
by Shyam |

X
దిశ, సిద్దిపేట: తన సొంత కారుపై పెండింగ్ ఉన్న నాలుగు ఈ-చలాన్లను సిద్దిపేట ఏసీపీ రామేశ్వర్ పేటీఎం ద్వారా డబ్బులు చెల్లించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ.. వాహనదారులు వారి సొంత వాహనాలపై ఉన్న పెండింగ్ చలాన్ జరిమానా చెల్లించాలని సూచించారు. త్వరలో పోలీస్ కమిషనర్ ఆదేశానుసారం సిద్దిపేట పట్టణంలో పెద్ద ఎత్తున స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామని తెలిపారు. మూడు కానీ అంతకంటే ఎక్కువ ఈ-చలాన్ పెండింగ్ ఉన్న వాహనదారులకు వారి ఫోన్ నెంబర్లకు మెసేజ్ వస్తుందని.. వెంటనే ఆన్లైన్లో జరిమానా చెల్లించాలని ఏసీపీ రామేశ్వర్ సూచించారు.
Next Story