ఇంట్రెస్టింగ్‌గా అక్షర ఫస్ట్ లుక్..

by  |
ఇంట్రెస్టింగ్‌గా అక్షర ఫస్ట్ లుక్..
X

దిశ, వెబ్‌డెస్క్: లోక నాయకుడు కమల్ హాసన్ కూతురు అక్షర హాసన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘అచ్చమ్ మదమ్ నానమ్ పయిర్పు’. రాజ రామ్మూర్తి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం ఒక యువతి కళ్లకు కనిపించే ప్రపంచం గురించి పరిచయం చేయనుంది. ట్రెండ్ లౌడ్ బ్యానర్‌పై తెరకెక్కిన చిత్రం ఫస్ట్ లుక్ ఆకట్టుకుంటుండగా.. తన కళ్లకు పరిచయమైన ప్రపంచం గురించి లోకానికి పరిచయం చేసేందుకు ఆత్రుతగా ఉందని తెలిపింది అక్షర. స్టన్నింగ్ ఐస్‌తో అక్షర మెస్మరైజ్ చేస్తున్నా.. ఆ కళ్లలో కనపడే భయం సినిమాపై ఆసక్తి కలిగిస్తోంది. ఓ మంచి అమ్మాయి కథలో ఎలాంటి మనుషులు ఉన్నారు? తెలుసుకోవాలంటే మరిన్ని రోజులు ఆగక తప్పదని చెబుతోంది మూవీ యూనిట్.

Read Also…

క్రైమ్ థ్రిల్లర్‌గా ‘రేప్ డి’ సిరీస్

Next Story

Most Viewed