ఆచార్య ఇష్యూలో చిరు జోక్యం?

by  |
ఆచార్య ఇష్యూలో చిరు జోక్యం?
X

దిశ, వెబ్‌డెస్క్ : మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ఆచార్య. మెగా పవర్‌ స్టార్ రామ్ చరణ్ కూడా పవర్‌ఫుల్ రోల్‌లో కనిపించబోతున్నారు. చిరు పుట్టినరోజున ఆచార్య ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ రిలీజ్ చేయగా భారీ రెస్పాన్స్ రావడమే కాక, సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయింది. అయితే, మోషన్ పోస్టర్‌లో చూపించిన సన్నివేశానికి, తాను రాసుకున్న కథకు సంబంధం ఉందని.. ఆచార్య నా కథే అని ఆరోపించారు రచయిత రాజేష్. దీనిపై స్పందించిన ఆచార్య నిర్మాణ సంస్థలు కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్స్ దీనిపై క్లారీటీనిచ్చాయి. ఇది ముమ్మాటికి కొరటాల శివ కథ, కాన్సెప్ట్ అని.. కావాలనే కొందరు దీనిపై రచ్చ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని నోట్ రిలీజ్ చేసింది.

కానీ, విషయం అది కాదని.. ఇష్యూని సైలెంట్‌గా క్లోజ్ చేశారని తెలుస్తోంది. ఆచార్య సినిమాపై ఫ్యూచర్‌లో ఎఫెక్ట్ పడే అవకాశం ఉందని భావించిన మెగాస్టార్ చిరంజీవి.. ఈ విషయంలో జోక్యం చేసుకుని రచయిత రాజేష్‌ను బుజ్జగించినట్లు సమాచారం. ముందుగా కొరటాలతో మాట్లాడిన చిరు.. అసలేం జరిగిందనేది తెలుసుకున్నాక, ఆ తర్వాత రాజేష్‌తో సంధి కుదిర్చినట్లు ఫిల్మ్ నగర్ టాక్.



Next Story

Most Viewed