చిన్నారిపై లైంగిక దాడి చేసిన నిందితుడి అరెస్ట్..!

by  |
చిన్నారిపై లైంగిక దాడి చేసిన నిందితుడి అరెస్ట్..!
X

దిశ, పటాన్‌చెరు:

నాలుగేళ్ల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడిని సంగారెడ్డి జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గత శనివారం పటాన్‎చెరు నియోజకవర్గం దోమడుగు గ్రామంలో తెల్లవారుజామున ఆగంతుకుడు చిన్నారిని ఎత్తుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. చిన్నారి ఏడవగా నిందితుడు భయపడి ఇంటివైపు వెళ్లే దారిలో వదిలిపెట్టి వెళ్లిపోయాడు. చిన్నారి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నేరస్తుడిని పట్టుకున్నట్లు డీఎస్పీ శ్రీధర్ రెడ్డి తెలిపారు. నిందితుడు పంకజ్ సింగ్‎ను రిమాండ్‎కు తరలించినట్లు వెల్లడించారు.


Next Story