‘అలాంటి వారికి పెద్ద పీట’

by Shyam |
‘అలాంటి వారికి పెద్ద పీట’
X

ఇంటర్మీడియట్ విద్యాశాఖలో అవినీతి, అక్రమాలు పెరుగుతున్నాయని.. ఇంటర్ బోర్డు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఉద్యోగుల సంఘం నాయకులు రామకృష్ణ గౌడ్ అన్నారు. బోర్డు పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగుల పట్ల ప్రభుత్వ అండదండలతో.. ఉన్నత వర్గాలకు చెందిన అధికారులు వివక్షత చూపిస్తున్నారని విమర్శించారు. పలు సందర్భాల్లో న్యాయస్థానం మొట్టికాయలు వేసిన అధికారుల తీరు మారడం లేదని తెలిపారు. అసిస్టెంట్ డైరెక్టర్ లక్ష్మారెడ్డి, జూనియర్ లెక్చరర్స్ సంఘం నాయకులు మధుసూదన్ రెడ్డి అవినీతి, అక్రమాలకు పాల్పతున్నారని ఆయన ఆరోపించారు. వీరిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సోమవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహిస్తున్నామన్నారు.

Read also..

‘ఎరుకల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలి’


Next Story