ఒకరి ప్రాణం తీసిన మరొకరి సెల్ఫీ పిచ్చి

by Sumithra |
One died
X

దిశ, పరిగి : వరద నీటిలో సెల్పీలో దిగుతూ కిందపడగా ఇద్దరిని ఈత రాకున్నా కాపాడే ప్రయత్నం చేసి ఓ యుకుడు మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన వికారాబాద్ జిల్లా పరిగి మండలం లఖ్నాపూర్ ప్రాజెక్టు వద్ద చోటు చేసుంది. పరిగి ఎస్ఐ పాటిల్ క్రాంతి కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. హైదారాబాద్ పరిధిలోని సూరారం ప్రాంతానికి చెందిన వీర రాజేశ్ తన కుటుంబీకులతో కలిసి ఆదివారం వికారాబాద్ జిల్లా అనంతగిరి కొండకు వచ్చి అనంత పద్మనాభ స్వామిని దర్శించుకున్నారు. అక్కడి నుంచి పరిగి మండలం లఖ్నాపూర్ ప్రాజెక్టు అలుగు పారుతుందని తెలుసుకొని ప్రాజెక్ట్ వద్దకు చేరుకున్నారు. ప్రాజెక్టు దిగువ బాగాన పారుతున్న నీటిలో తన బంధువులు ఇద్దరు సెల్పీ ( ఫొటోలు) దిగుతూ కిందపడ్డారు.

ఇది గమనించిన వీర రాజేశ్​తనకు ఈత రాకున్నా వారిని కాపాడే ప్రయత్నం చేస్తూ నీటిలో మునిగాడు. కొంత దూరంలో చేపలు పడుతున్న మత్య్సకారులు ఆనం రాజు, దుంపల వెంకటేష్ నీటిలో పడిన ముగ్గురిని బయటిక తీశారు. అప్పటికే రాజేశ్ నీటిలో మునిగి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. వెంటనే అంబులెన్స్‌కు ఫోన్ చేయగా అందుబాటులో లేదు. అక్కడే విధులు నిర్వహిస్తున్న హోంగార్డు రఘు కారులో పరిగి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స చేస్తుండగా వీర రాజేశ్ మృతి చెందాడు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పరిగి ఎస్ఐ పాటిల్ క్రాంతి కుమార్ తెలిపారు.

Advertisement

Next Story