రామగుండం ఎన్టీపీసీలో ప్రమాదం.. జారిపడి అధికారి దుర్మరణం

by GSrikanth |   ( Updated:2023-04-27 02:51:12.0  )
రామగుండం ఎన్టీపీసీలో ప్రమాదం.. జారిపడి అధికారి దుర్మరణం
X

దిశ, వెబ్‌డెస్క్: పెద్దపల్లి జిల్లాలోని రామగుండం ఎన్టీపీసీలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు జారిపడి జశ్వంత్ అనే అధికారి దుర్మరణం చెందారు. వివరాల్లోకి వెళితే.. తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టు స్టేజీ-1లో నిర్మితమవుతున్న 800 వాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం గల యూనిట్‌ -2లోని బాయిలర్ వద్ద సెకండ్ షిఫ్ట్‌లో విధులు నిర్వహిస్తుండగా జశ్వంత్ ప్రమాదవశాత్తు 30 మీటర్ల ఎత్తు నుంచి జారి కిందపడ్డాడు. తీవ్రంగా గాయపడిన అతన్ని ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ చనిపోయినట్లు వైద్యులు తెలిపారు.

Advertisement

Next Story