కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలు.. ఏం జరిగిందంటే?

by  |
కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలు.. ఏం జరిగిందంటే?
X

దిశ, తుంగతుర్తి: ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొని కానిస్టేబుల్ కు తీవ్ర గాయాలైన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డ గూడూరు మండల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే భువనగిరి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న పురుగుల శ్రీనివాస్ అనే ఏఅర్ కానిస్టేబుల్ అతని స్వగ్రామమైన అడ్డగూడూరు మండలం కోటమర్తి గ్రామానికి వచ్చి తిరిగి విధుల కోసం భువనగిరికి వెళుతున్న క్రమంలో చౌల్ల రామారం స్టేజి వద్ద రోడ్డుపై నిలిపిన లారీని వెనుకనుంచి ఢీకొని తలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతడిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం అడ్డగూడూరు ఎస్సై మహేష్ తెలిపారు.



Next Story