- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏసీసీ సిమెంట్ త్రైమాసిక లాభం రూ.364 కోట్లు
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ సిమెంట్ తయారీ సంస్థ ఏసీసీ సిమెంట్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో ఏకీకృత లాభం రూ. 364 కోట్లతో 19.8 శాతం వృద్ధిని నమోదు చేసింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో కంపెనీ రూ. 303 కోట్లను వెల్లడించింది. కొవిడ్-19 వ్యాప్తి, ఆందోళనలు ఉన్నపటికీ భారత ఆర్థికవ్యవస్థ సానుకూల సంకేతాలనే కనబరుస్తోంది. తమ కంపెనీ సైతం రికవరీ సంకేతాలను నమోదు చేస్తోంది.
వాల్యూమ్‌లు, అమ్మకాల పరంగా మునుపటి ఏడాది స్థాయికి తిరిగి వచ్చామని ఏసీసీ సిమెంట్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీధర్ బాలకృష్ణన్ చెప్పారు. సాధారణంగా ఏసీసీ లిమిటెడ్ కంపెనీ జనవరి నుంచి డిసెంబర్ కాలాన్ని ఆర్థిక సంవత్సరంగా పరిగణిస్తుంది. కంపెనీ వడ్డీ, పన్నులు రుణమాఫీకి ముందు రూ. 511 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది.
ఇది 20 శాతం వార్షిక వృద్ధి. ఇక, జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో నికర అమ్మకాలు రూ. 3,468 కోట్లు, అమ్మకాల పరిమాణం 6.49 లక్షల టన్నులుగా నమోదయ్యాయి. కరోనా నేపథ్యంలో కంపెనీ మూలధనాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తున్నాం. సమీక్షించిన త్రైమాసికంలో వ్యయ తగ్గింపు ప్రణాళికలు గణనీయమైన మార్జిన్ విస్తరణకు సహాయపడ్డాయని శ్రీధర్ బాలకృష్ణన్ తెలిపారు.