లంచం అడిగాడు ఏసీబీకి చిక్కాడు… న‌ల్లబెల్లిలో ఘటన

by Sumithra |   ( Updated:2021-06-28 05:35:20.0  )
acb raid at nallbelli
X

దిశ, నర్సంపేట : అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు ఓ లంచవతారమెత్తిన వీఆర్వో ను పట్టుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే… నల్లబెల్లి మండలంలోని మేడపల్లి గ్రామానికి చెందిన ఎవరాజు యాకాంబరం కూతురు మౌనిక పెళ్లి కొన్ని నెలలకిందట జరిగింది. కళ్యాణలక్ష్మి చెక్కు సైతం మే నెలలో మంజూరు చేశారు. మేడపల్లి గ్రామానికి చెందిన వీఆర్వో ఎదురబోయిన ఐలయ్య.. మౌనిక కళ్యాణ లక్ష్మి చెక్కుకు సంబంధించి అతని తండ్రి యాకాంబరంను డబ్బులు డిమాండ్ చేశారు. మూడు వేల రూపాయలు ఇస్తుండగా పక్కా ప్లాన్ ప్రకారం ఏసీబీ అధికారులు వీఆర్వో ఐలయ్యను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.



Next Story