అధికారుల ఇండ్లల్లో ..భారీగా అవినీతి సొమ్ము…

by  |
అధికారుల ఇండ్లల్లో ..భారీగా అవినీతి సొమ్ము…
X

దిశ వెబ్ డెస్క్:
నర్సాపూర్ ఆర్డీఓ అరుణా రెడ్డి నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలను బుధవారం నిర్వహించారు. ఆమె ఇంట్లో రూ.28 లక్షలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 12 మంది రెవెన్యూ అధికారుల నివాసాల్లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఘట్కేసర్ పరిధిలో ఉన్న ఆర్డీఓ నివాసంపై ఏసీబీ దాడి చేసింది.

కాగా చిప్పల్‌తుర్తి గ్రామంలో 112 ఎకరాల భూమికి ఎన్ వోసి విషయంలో రూ. కోటి 40 లక్షలను మెదక్ అడిషనల్ కలెక్టర్ గడ్డం నగేశ్ డిమాండ్ చేశారు. చివరకు రూ. కోటి 12లక్షలకు బేరం కుదుర్చుకున్నారు. వాటిలో రూ.72లక్షలను భూమి , రూ.40లక్షలను నగదు రూపంలో ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంలో ఏసీబీకి రెడ్ హ్యండెడ్ గా పట్టుపడ్డారు. దీంతో బాధితుని ఫిర్యాదు మేరకు 12 మంది రెవెన్యూ అధికారుల నివాసాలపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. నగేశ్ ఇంటి నుంచి రూ.లక్ష నగదు, ఇతర ఆస్తి పత్రాలను, బ్లాంక్ చెక్కులను, అగ్రిమెంట్ పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. కాగా అదనపు కలెక్టర్ నగేశ్ తో పాటు బండారు అరుణారెడ్డి, ఎమ్మార్వో సత్తార్, వీఆర్వో,జూనియర్ అసిస్టెంట్ల నివాసాలు, కార్యాలయాలపై ఏసీబీ తనిఖీలు కొనసాగుతున్నాయి.


Next Story

Most Viewed