డీఎం హెచ్ ఓ ఆఫీస్ పై ఏసీబీ దాడులు

దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్ నేపథ్యంలో మందుల కొనుగోళ్లు, ఉద్యోగుల భర్తీపై ఏసీబీ అధికారులు ప్రత్యేక నిఘా వేశారు. అనంతపురం డీఎంహెచ్‌వో కార్యాలయంపై మందుల కొనుగోళ్లపై అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు రావడంతో ఏసీబీ దాడులు చేసింది. రికార్డులను బయటకు తీసిన అధికారులు పరిశీలిస్తున్నారు. అయితే, ఆ కార్యాలయ అర్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రత్న కుమార్ ఛాంబర్ రికార్డులను పరిశీలిస్తుండగా..అతడు అక్కడి నుంచి వెళ్లిపోవడానికి యత్నించాడు. దీంతో అధికారులు అతడిని అడ్డుకొని రికార్డులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.

Advertisement