ఏసీబీ వలలో ఆ ముగ్గురు

by Aamani |
ఏసీబీ వలలో ఆ ముగ్గురు
X

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్ : ఏసీబీ వలలో మూడు అవినీతి చేపలు చిక్కాయి. వివరాల్లోకి వెళితే.. నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం కంకెటకు చెందిన శ్రీనివాసరావు ఇటీవలే విదేశాల నుంచి వచ్చాడు. నిర్మల్ మండలం అనంతపేట శివారులో అతనికి ఉన్న 13 ఎకరాల భూమిలో వెంచర్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించి గ్రామపంచాయతీకి వదలాల్సిన వేకెంట్ ల్యాండ్ విషయంలో వివాదం తలెత్తింది. ఇందుకు గానూ రూ.5 లక్షలు ఇవ్వాలని నిర్మల్ ఎంపీఓ శ్రీనివాస్ రెడ్డి, అనంతపేట పంచాయతీ కార్యదర్శి సత్యనారాయణ, సర్పంచ్ భర్త నేరెళ్ల అశోక్ డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు గతంలో కొంత మొత్తం వారికి ఇచ్చాడు. తాజాగా రూ.2.7లక్షలు ఇచ్చే విషయంలో ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. నిర్మల్ ఎంపీడీఓ ఆఫీస్‌లో బాధితుడి నుంచి ఆ ముగ్గురు డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

Advertisement

Next Story