రూ.40లక్షలపై నోరు మెదపని అడిషనల్ కలెక్టర్

by  |
రూ.40లక్షలపై నోరు మెదపని అడిషనల్ కలెక్టర్
X

దిశ, తెలంగాణ క్రైమ్‌బ్యూరో: మెదక్ జిల్లా భూ వివాదంలో తీసుకున్న రూ.40లక్షల వ్యవహారంపై అడిషనల్ కలెక్టర్ నగేష్ ఏసీబీ అధికారుల వద్ద నోరు మెదపలేదని సమాచారం. నాలుగు రోజుల కస్టడీ గడువు ముగియడంతో ఏసీబీ అధికారులు చేసేదేం లేక అడిషనల్ కలెక్టర్ నగేష్‌తో పాటు మిగతా నలుగురు నిందితులను తిరిగి జైలుకు తరలించారు. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం చిప్పల్‌తుర్తిలో 112ఎకరాలకు ఎన్ఓసీ క్లియరెన్స్ ఇచ్చేందుకు అడిషనల్ కలెక్టర్ ఎకరానికి రూ.1లక్ష చొప్పున డిమాండ్ చేసి, రెండు విడతలుగా రూ.40 లక్షలు తీసుకున్నట్టుగా ఏసీబీ అధికారులు గుర్తించారు.

ఈ క్రమంలో ఆర్డీవో అరుణారెడ్డి నివాసంలో చేపట్టిన సోదాలలో రూ.28లక్షల నగదు, అరకిలో బంగారం ఆభరణాలు లభ్యమయ్యాయి. ఈ కేసులో ఐదుగురు నిందితులు రిమాండ్ కాగా, కోర్టు అనుమతితో ఈనెల 21నుంచి 24వరకూ 4రోజుల కస్టడీలో ఏసీబీ విచారించింది. కలెక్టర్ ఆఫీస్, రెవెన్యూ డివిజన్లు, మండల స్థాయి ఉద్యోగులను సుమారు 50మందిని ఏసీబీ అధికారులు ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే అడిషనల్ కలెక్టర్ బినామీగా కోలా జీవన్‌గౌడ్‌ను గుర్తించి అరెస్ట్ చేయగా, మరో ఆరుగురు బినామీలను గుర్తించినట్టుగా సమాచారం.


Next Story

Most Viewed