చెక్‌పోస్టుపై ఏసీబీ దాడులు..

దిశ, వెబ్‌డెస్క్ :

ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా నరహరిపేట వద్ద గల రవాణా చెక్‌పోస్టుపై అవినీతి నిరోధక శాఖ అధికారులు (ACB)దాడులు నిర్వహించారు.ఇవి సోమవారం రాత్రి నుంచి కొనసాగుతున్నట్లు అధికారులు వెల్లడించారు.

విధినిర్వహణలో ఉన్న చెక్‌పోస్టు అధికారులు, సిబ్బంది లెక్కకు మించి భారీ మొత్తంలో డబ్బులు తీసుకున్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. దీంతో వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిపారు. కాగా, దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉన్నది.

Advertisement