- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తహసీల్దార్ నాగరాజును విచారించిన ఏసీబీ
దిశ, క్రైమ్‌బ్యూరో: ఇటీవల రూ.1.10 కోట్లు లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన కీసర తహసీల్దార్‌ను ఏసీబీ మంగళవారం కస్టడీకి తీసుకుని విచారించింది. ఈనెల 14న కీసర మండలం రాంపల్లి దయారా గ్రామంలో 19ఎకరాల 39గుంటల భూమిని రియల్టర్లకు పట్టా పాస్ బుక్ ఇచ్చేందుకు పెద్ద మొత్తంలో లంచం తీసుకుంటుండగా నాగరాజును అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, రిమాండ్‌లో ఉన్న తహసీల్దార్ నాగరాజుతో పాటు మరో ముగ్గురు నిందితులను కస్టడీ కోరుతూ కోర్టులో ఏసీబీ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటీషన్‌కు కోర్టు మూడ్రోజుల కస్టడీకి అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం చంచల్‌గూడ జైలు నుంచి నలుగురు నిందితులను బంజారాహిల్స్ ఏసీబీ ప్రధాన కార్యాలయానికి తీసుకువచ్చి విచారించిన అనంతరం తిరిగి జైలుకు పంపారు. మొదటి రోజు విచారణలో ముఖ్యంగా లాకర్ గురించి, తీసుకున్న లంచం ఏ ఏ అధికారులకు ఇవ్వాలనే అంశాలను విచారించారు. మళ్ళీ బుధవారం ఉదయం 10గంటలకు జైలు నుంచి తీసుకొచ్చి రెండోరోజు విచారించనున్నారు.