లంచం కేసులో ఏసీబీకి చిక్కిన జడ్జి

by Sumithra |
లంచం కేసులో ఏసీబీకి చిక్కిన జడ్జి
X

ముంబయి : న్యాయం చెప్పాల్సిన న్యాయమూర్తే అవినీతికి పాల్పడి అరెస్టైన ఘటన మహారాష్ట్రలో వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకున్న కేసులో సదరు జడ్జి హస్తం ఉండటంతో విచారణ చేపట్టిన అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు.. ఆ న్యాయమూర్తిని అరెస్టు చేశారు. వివరాల్లోకెళ్తే.. మహారాష్ట్రలోని పూణెలో ఓ స్థానిక కోర్టులో న్యాయమూర్తిగా పనిచేస్తున్న అర్చన జట్కర్‌ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆమెతో పాటు ఒక సస్పెండైన పోలీసు అధికారి, మరో ముగ్గురు వ్యక్తులను ఏసీబీ గతంలోనే అరెస్టు చేసింది. ఒక పాల వ్యాపారి నుంచి రూ. 2.5 లంచం తీసుకున్న కేసులో వీరిని అరెస్టు చేసినట్టు ఏసీబీ అధికారులు తెలిపారు. నిందితులను విచారించగా.. ఇందులో అర్చన జట్కర్ పేరు కూడా ఉన్నట్టు తేలడంతో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం అప్లై చేసుకున్న అర్చన అభ్యర్థనను ఏసీబీ కోర్టు నిరాకరించింది.

Advertisement

Next Story