రాష్ట్రపతిని కలిసిన అకాళీదళ్ బృందం

by  |
రాష్ట్రపతిని కలిసిన అకాళీదళ్ బృందం
X

దిశ వెబ్ డెస్క్:
రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్‌ను శిరోమణి అకాలీదళ్ ప్రతినిధి బృందం సోమవారం కలిసింది. రైతులకు అన్యాయం చేసే వ్యవసాయ బిల్లులను ఆమోదించవద్దని రాష్ట్రపతిని అకాలీదళ్ బృందం కోరింది. ఈ మేరకు బిల్లులను తిరిగి పంపాలని రామ్ నాథ్ కోవింద్ ను బృందం అభ్యర్థించింది. కాగా పార్లమెంట్‌లో మూడు వ్యవసాయ బిల్లులను కేంద్రం ఆమోదించింది. ఈ బిల్లులపై పంజాబ్, హర్యానాల్లో రైతుల నుంచి తీవ్రవ్యతిరేకత ఎదురవుతోంది. దీంతో రైతులకు మద్దతుగా శిరోమణి అకాళీదళ్ పార్టీ నిలిచింది. ఈ నేపథ్యంలో ఆ పార్టీకి చెందిన హరి సిమ్రత్ కౌర్ తన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ బిల్లులను కేంద్రం వెనక్కు తీసుకోవాలని ఆ పార్టీ డిమాండ్ చేసింది. లేకుంటే ఎన్డీఏ ప్రభుత్వం నుంచి వైదొలిగేందుకు వెనకాడబోమని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. తాజాగా రాష్ట్రపతిని అకాళీదళ్ బృందం కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.


Next Story