జగన్ కాలేజీ వద్ద ఉద్రిక్తత.. విద్యార్థుల భవిష్యత్‌తో చెలగాటం

by srinivas |   ( Updated:2021-12-02 05:26:38.0  )
abvp
X

దిశ, ఏపీ బ్యూరో: నెల్లూరు నగరంలోని జగన్ కళాశాల వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. డిగ్రీ పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు హాల్‌టికెట్ ఇవ్వకపోవడంతో ఏబీవీపీ కార్యకర్తలు గురువారం కాలేజీ ముందు బైఠాయించారు. మరో గంటలో డిగ్రీ పరీక్షల పెట్టుకొని కళాశాల యాజమాన్యం విద్యార్థులకు హాల్ టిక్కెట్లు ఇవ్వకుండా నానా ఇబ్బందులు పెడుతుందని ఏబీవీపీ నెల్లూరు నగర కార్యదర్శి సాయికృష్ణ ఆరోపించారు.

విద్యార్థుల భవిష్యత్‌తో ఆడుకునే ప్రయత్నాలను తిప్పికొడతామని హెచ్చరించారు. జిల్లా ఉన్నతాధికారులు వెంటనే స్పందించి జగన్ కళాశాలలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కళాశాల గేటు దగ్గర కూర్చుని యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ నిరసనలో బాలాజీ, యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు.


Advertisement
Next Story

Most Viewed