- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మొబిక్విక్‌లో మైనారిటీ వాటా కొనుగోలు చేసిన అబుదాబి ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ!
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ డిజిటల్ చెల్లింపుల యాప్ మొబిక్విక్‌లో యూఏఈ సావరీన్ వెల్త్ ఫండ్ సంస్థ అబుదాబి ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ దాదాపు 20 మిలియన్ డాలర్ల(రూ. 150 కోట్ల)కు మైనారిటీ వాటాను కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. ఈ ఏడాది మార్చిలో మొబిక్విక్ భారీగా డేటా లీక్ వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. సుమారు కొటిమంది వినియోగదారుల వ్యక్తిగత డేటా హ్యాక్ అయినట్టు ఆరోపణలొచ్చాయి. ‘అబూఅద్బి ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ తాజాగా రూ. 150 కోట్ల నిధులను ఇన్వెస్ట్ చేయడంతో కంపెనీ విలువ 700 మిలియన్ డాలర్లు(దాదాపు రూ. 5,193 కోట్లు)కు చేరిందని రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ ఫైలింగ్‌లో వెల్లడించింది.
ఈ ఏదాది మార్చి నుంచి ఇప్పటివరకు మొబిక్విక్ రూ. 235 కోట్లకు పైగా నిధులను సమీకరించింది. ఈ నిధుల సేకరణలో భాగంగా కంపెనీ మాజీ బ్లాక్‌స్టోన్ ఇండియా హెడ్ మథ్యూ సిరియాక్, పద్మ అవార్డు గ్రహీత సత్‌పాల్ ఖతర్, మాజీ ఇన్ఫోసిస్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్ వి జి ధీజ్ఇజిత్ వంటి పెట్టుబడిదారులు కొత్త వాటాదారులుగా చేర్చుకుంది. వీరితో పాటు సీక్వోయా కేపిటల్, బజాజ్ ఫైనాన్స్ కూడా వాటాదారులుగా ఉన్నాయి. మొబిక్విక్ తన నెట్‌వర్క్‌లో రోజూ 10 లక్షల లావాదేవీలను నిర్వహిస్తోంది. ఇందులో డిజిటల్ వ్యాలెట్, మొబైల్‌ఫోన్ టాప్-అప్స్, యుటిలిటీ బిల్లుల చెల్లింపులు ఉన్నాయి. 30 లక్షల మంది వ్యాపారులు ఈ కంపెనీ నెట్‌వర్క్ పరిధిలో ఉన్నారు. 10 కోట్లకు పైగా వినియోగదారులకు సేవలందిస్తోంది.