ఆబ్కారోళ్ల ‘రేటే’ వేరు !

by Shyam |
ఆబ్కారోళ్ల ‘రేటే’ వేరు !
X

దిశ, న్యూస్‌‌బ్యూరో: లాక్‌డౌన్ సడలింపుల్లో భాగంగా ఈ నెల 6 నుంచి మద్యం దుకాణాలు తెర్చుకున్నాయి. ధరలు కూడా పెరిగాయి. అయితే అప్పటికే దుకాణాల్లో నిల్వ ఉన్న సరుకుకు కొత్త ధరలనే వర్తింపజేయాలని ఎక్సైజ్ శాఖ నిర్ణయం తీసుకుంది. ఏయే దుకాణంలో ఎంత స్టాకు ఉందో వివరాలను సేకరించి ఆ దుకాణం యజమాని ఎంత కట్టాలో లెక్కలు వేసింది. ఆ ప్రకారం రాష్ట్రంలో ఉన్న 2,212 దుకాణాల నుంచి రావాల్సిన లెక్కలను సిద్ధం చేసింది. వీటిని ఈ నెల 31వ తేదీలోగా చెల్లించాలని లేకుంటే 18% పెనాల్టీని వసూలు చేయాల్సిందేనని అన్ని సర్కిళ్ళ డిప్యూటీ కమిషనర్లకు ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ సర్క్యులర్ జారీ చేశారు. ప్రభుత్వం మద్యంపై పన్నును పెంచినందున ఈనెల 5వ తేదీ నాటికి దుకాణాల్లో ఉన్న స్టాకుపై సుమారు రూ.71.70 కోట్లు అదనంగా వసూలు కావాల్సి ఉంది. లాక్‌డౌన్ సడలింపుల నేపథ్యంలో మే 6 నుంచి మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. అయితే అప్పటికే ఒక రోజు ముందు అన్ని దుకాణాల్లో స్టాకు లెక్కల వివరాలను అధికారులు సేకరించారు. మార్చి 22న జనతా కర్ప్యూ మొదలు మే నెల 5వ తేదీ వరకు మద్యం దుకాణాలన్నీ మూతబడే ఉన్నాయి. మార్చి 20, 21 తేదీల్లో తెచ్చుకున్న స్టాకు దుకాణాల్లోనే ఉండిపోయింది.

మద్యం దుకాణాలు తెరుచుకోవడంతోనే గరిష్ఠ చిల్లర ధరలపై ఆయా రకాలను బట్టి 11% నుంచి 16 శాతం మధ్యలో పెంచింది. దీనికి స్పెషల్ ఎక్సైజ్ సెస్ అని పేరు పెట్టింది. ఆ ప్రకారం రాష్ట్రంలోని 2,212 మద్యం దుకాణాల నుంచి రూ. 71.70 కోట్ల మేర పాత స్టాకు నుంచి రావాల్సి ఉందని ఆబ్కారీ శాఖ అంచనా వేసింది. ఈ పన్నును మే 31 లోపు చెల్లించలేకపోతే ప్రతీ నెలకు 18% పెనాల్టీ చొప్పున జూలై 31వ తేదీకల్లా వసూలు చేయాలని డిప్యూటీ కమిషనర్లకు ఆ శాఖ డైరెక్టర్ స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed