తాప్సీ మేల్ బాడీపై ట్రోల్స్.. షాకైన అభిషేక్

by Shyam |
Tapsee1
X

దిశ, సినిమా: బబ్లీ హీరోయిన్ తాప్సీ పన్ను లీడ్ రోల్‌లో నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ ‘రష్మి రాకెట్’. క్రీడల్లో జెండర్ టెస్టింగ్ సమస్యలపై తెరకెక్కిన చిత్రంలో అభిషేక్ బెనర్జీ కో-స్టార్‌గా నటించారు. అయితే కొంతమంది నెటిజన్లు ఈ సినిమాలో తాప్సీ లుక్‌ను ఉద్దేశిస్తూ.. మగాడిలా ఉన్నావంటూ ట్విట్టర్ వేదికగా నెగెటివ్ కామెంట్స్ చేశారు. కాగా ఈ వ్యాఖ్యలు చూసి షాకైనట్లు తెలిపిన అభిషేక్.. మూవీలో తాప్సీ క్యారెక్టర్ కూడా ఇదే విషయాన్ని చర్చిస్తుందని తెలిపాడు. ‘ఇది ప్రమోషన్‌లో భాగమా? లేదంటే ఉద్దేశపూర్వకంగానే జరుగుతుందా? అని ఆశ్చర్యపోయాను. ఈ ట్రోల్స్ మా సినిమా కంటెంట్‌‌ను పోలిఉండటం ఫన్నీగా ఉంది’ అని చెప్పుకొచ్చాడు. ఇక ఈ చిత్రంలో సిస్టమ్‌పై పోరాడే వ్యక్తి పాత్రలో నటించినట్లు తెలిపిన అభిషేక్.. నిజానికి ఈ సమస్యలపై పోరాడటం ప్రజల ప్రాథమిక హక్కు అని వెల్లడించాడు. కాగా, కనిక థిల్లాన్ కథ అందించిన ఈ ‘రష్మి రాకెట్’ చిత్రానికి ఆకర్ష్ ఖురానా దర్శకత్వం వహిస్తున్నారు.

Advertisement

Next Story