- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
నెపోటిజంపై అభిషేక్ ఏమన్నారంటే..

లెజెండరీ యాక్టర్ అమితాబ్ బచ్చన్ కొడుకు అభిషేక్ బచ్చన్.. నెపోటిజంపై స్పందించారు. ఎంత గొప్ప నటవారసుడైనా సరే, సినిమాల్లోకి రావాలంటే చాలా కష్టపడాల్సి వస్తుందని చెప్తూ.. తను సినీరంగంలోకి వచ్చేందుకు ఎంత కష్టపడ్డాడో వివరించాడు. ‘ఒక నటుడిగా రాణించాలంటే ఎవరికైనా కష్టమే.. అది అవుట్‌సైడర్స్ కావచ్చు లేదా ఇన్ సైడర్స్ కావచ్చు’ అని తెలిపాడు.
1998లో సినిమాల్లోకి వచ్చేందుకు ప్రయత్నించానని తెలిపిన జూనియర్ బచ్చన్.. డైరెక్టర్ రాకేష్ మెహ్రా, తను ‘సంజౌతా ఎక్స్‌ప్రెస్’ సినిమాతో ఒకేసారి లాంచ్ కావాలనుకున్నట్లు తెలిపారు. కానీ ఎంత మంది దర్శక, నిర్మాతలను కలిసినా లాభం లేకుండా పోయిందని.. అసలు ఎవరూ పట్టించుకోలేదని తెలిపారు. చివరకు రాకేష్ డాడీని సంప్రదించగా.. జేపీ దత్తా ‘రెఫ్యూజీ’ సినిమా ద్వారా తనను లాంచ్ చేశారని చెప్పాడు. టాలెంట్ ఉంటే కచ్చితంగా ప్రోత్సాహం లభిస్తుందంటూ.. నెపోటిజం అనేది ఇండస్ట్రీలో లేదని చెప్పేందుకు ప్రయత్నించారు అభిషేక్.