పాజిటివ్ ట్వీట్ కోసం లంచం తీసుకున్న హీరోయిన్.. అభిషేక్ కామెంట్

by Shyam |
పాజిటివ్ ట్వీట్ కోసం లంచం తీసుకున్న హీరోయిన్.. అభిషేక్ కామెంట్
X

దిశ, సినిమా : బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ లేటెస్ట్ ఫిల్మ్ ‘ది బిగ్ బుల్’ డిస్నీ + హాట్ స్టార్‌లో రిలీజైంది. ఈ సినిమాలో జూనియర్ బచ్చన్ పర్ఫార్మెన్స్‌కు మిక్స్డ్ టాక్ వస్తోంది. ఈ క్రమంలో హీరోయిన్ సోఫీ చౌదరి.. హర్షద్ మెహతా పాత్రలో అభిషేక్ నటనకు ఇంప్రెస్ అయ్యానని తెలిపింది. బాడీ లాంగ్వేజ్ నుంచి చిన్న చిన్న ఎక్స్‌ప్రెషన్స్ వరకు అద్భుతంగా పలికించి పాత్రలో జీవించేశాడని కాంప్లిమెంట్స్ ఇచ్చింది. ఇక ఈ ట్వీట్‌పై స్పందించిన ఓ నెటిజన్.. మూవీ గురించి పాజిటివ్ ఒపీనియన్ ఇచ్చేందుకు అభిషేక్ నుంచి ఎంత లంచం తీసుకున్నావని ప్రశ్నించాడు. దీంతో ఆ వ్యక్తికి చాలా ఫన్నీగా సమాధానం ఇచ్చాడు అభిషేక్. ఏంటి సోఫీ.. మీ గత ట్వీట్స్ అన్నింటికీ నేను డబ్బులు చెల్లించాను కదా! ఆ విషయం చెప్పరేంటి? అని రిప్లయ్ ఇచ్చాడు.

Advertisement

Next Story