- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ పని చేసి సస్పెండ్ అయిన తుర్కయంజాల్ కమిషనర్
దిశ, అబ్దుల్లాపూర్‌మెట్: తుర్కయంజాల్ మున్సిపల్ కమిషనర్ అహ్మద్ షఫీ ఉల్లాను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ అమోయ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. టీఎస్ బీపాస్ ద్వారా భవన నిర్మాణ అనుమతుల కోసం జారీ చేసిన పర్మిషన్ ప్రొసీడింగ్‌లను నిబంధనలకు విరుద్ధంగా మాన్యువల్‌గా మార్పులు చేశారని నిరూపితమవడంతో షఫీ ఉల్లాను కలెక్టర్ సస్పెండ్ చేశారు.
కమ్మగూడలోని సర్వే నెంబర్ 253లో సిల్ట్ + మూడు అంతస్థుల భవనానికి పర్మిషన్ తీసుకొని నకిలీ అనుమతి పత్రాలతో 4వ అంతస్థు నిర్మించుకునేందుకు కమిషనర్ అనుమతించినట్లు ఆరోపిస్తూ స్థానిక కౌన్సిలర్ కాకుమాను సునీల్ చేసిన ఫిర్యాదుపై కలెక్టర్ విచారణ జరిపారు. దీనిపై కమిషనర్ షఫీ ఉల్లాకు, టౌన్ ప్లానింగ్ అధికారి స్రవంతికి నోటీసులు ఇచ్చారు. నోటీసులకు కమిషనర్ సరైన సమాధానం ఇవ్వకపోవడంతో ఆయనపై సస్పెన్షన్ వేటు వేశారు. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు సస్పెన్షన్ ఉత్తర్వులు అమలులో ఉంటాయని పేర్కొన్నారు.