RCB ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. ఏబీ డివిలియర్స్ మళ్లీ వస్తున్నాడు.!

by Anukaran |   ( Updated:2021-12-04 20:39:37.0  )
RCB ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. ఏబీ డివిలియర్స్ మళ్లీ వస్తున్నాడు.!
X

దిశ, వెబ్‌డెస్క్ : మిస్టర్ 360, దక్షిణాఫ్రికా స్టార్‌ ప్లేయర్ ఏబీ డివిలియర్స్‌ అందరినీ ఆశ్చర్యపరుస్తూ క్రికెట్‌కు వీడ్కొలు పలికిన విషయం తెలిసిందే. దుబాయ్ వేదికగా జరిగిన ఐపీఎల్-14లో ఆర్సీబీ తరఫున ప్రాతినిధ్యం వహించిన ఏబీ.. నవంబర్‌లో అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు గుడ్ బై చెప్పాడు. దీంతో ఏబీ అభిమానులతోపాటు ఆర్సీబీ ఫ్యాన్స్‌ నిరాశకు గురయ్యారు.

ఇదిలా ఉండగా ఆర్సీబీ హెడ్ కోచ్ సంజయ్ బంగర్.. అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. రిటైర్మెంట్ ప్రకటించడంతో ఆర్సీబీకి దూరమైన డివిలియర్స్ వచ్చే సీజన్‌లో ఆ RCB జట్టుకు బ్యాటింగ్‌ కోచ్‌గా వచ్చే అవకాశముందంటూ సంకేతాలు ఇచ్చారు. అలాగే.. ఏబీ డివిలియర్స్ వంటి ప్లేయర్‌ను టీం బ్యాటింగ్ కోచ్‌గా నియమిస్తే.. అది ఆటగాళ్లకు, జట్టుకు ఎంతో ఉపయోగపడుతుందని బంగర్‌ కామెంట్స్ చేశాడు. రిటైర్మెంట్ కారణంగా ఏబీ, విరాట్ కోహ్లీ మధ్య స్నేహం మరోసారి గ్రౌండ్‌లో కనిపించదు అని అభిమానులు అనుకున్నారు. ఒకవేళ ఆర్సీబీతో ఏబీ డివిలియర్స్ జత కడితే ఫ్యాన్స్‌కు మాత్రం పండుగే. అయితే.. రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరు యాజమాన్యంతో కూడా ఏబీకి మంచి సంబంధాలున్న విషయం తెలిసిందే. బంగర్ కామెంట్స్ చేసినప్పటికీ ఏబీ విషయంలో ఆర్సీబీ యాజమాన్యం నుంచి అధికారిక ప్రకటక రాలేదు.

Advertisement

Next Story

Most Viewed