- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఆస్పత్రి ఖర్చు రూ.1,000 దాటితే ఆరోగ్య శ్రీ వర్తింపు

X
దిశ, వెబ్ డెస్క్: ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారి ఖర్చులు రూ.1,000 దాటితే ఆరోగ్య శ్రీ వర్తించనుంది. పశ్చిమ గోదావరిలో పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభించిన ఈ సేవలను మరో ఆరు జిల్లాలకు విస్తరిస్తూ సీఎం వైఎస్ జగన్ ఆదేశాలు జారీ చేశారు. సోమవారం క్యాంపు కార్యాలయంలో ఆరోగ్యశ్రీ సీఈఓ డాక్టర్ మల్లిఖార్జున్‌తో సీఎం జగన్ సమావేశమయ్యారు. ఆరోగ్యశ్రీ పథకం అమలవుతున్న తీరుపై ఆయన ఆరా తీశారు. అనంతరం మరిన్ని జిల్లాలకు ఆరోగ్యశ్రీని వర్తింపు చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. ఈ క్రమంలో గురువారం నుంచి కడప, కర్నూలు, ప్రకాశం, గుంటూరు, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో వైద్యం ఖర్చు రూ.వేయి దాటితే ఆరోగ్యశ్రీ వర్తించనుంది.
Next Story