అమిత్ షా నివాసం ఎదుట ధర్నా..ఆప్ నేతలు అరెస్ట్

by Shamantha N |   ( Updated:2020-12-13 05:10:05.0  )
అమిత్ షా నివాసం ఎదుట ధర్నా..ఆప్ నేతలు అరెస్ట్
X

న్యూఢిల్లీ: కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ నివాసాల ముందు ధర్నా చేయడానికి ప్రయత్నించిన ఆప్ నేతలు రాఘవ్ చద్దా, అతీషి సహా ఇతర కార్యకర్తలను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఉత్తర ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ రూ. 2,500 కోట్ల దుర్వినియోగానికి పాల్పడిందని, ఈ స్కామ్‌పై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేస్తూ అమిత్ షా, ఢిల్లీ ఎల్జీ ఇండ్ల ముందు ధర్నా చేయాలని ఆప్ ప్లాన్ చేసింది. ఆప్ ఎమ్మెల్యే అతీషి, మరికొందరు కౌన్సిలర్లతో కలిసి ఎల్జీ నివాసం ముందుకు వచ్చినప్పటికీ బారికేడ్లను దాటకుండా పోలీసులు అడ్డుకున్నారు. వారిని అదుపులోకి తీసుకున్నారు.

ఆప్ నేత రాఘవ్ చద్దానూ అరెస్టు చేశారు. ధర్నా కోసం ఆప్ చేసిన అభ్యర్థనలను ఢిల్లీ పోలీసులు తిరస్కరించారు. కరోనా మహమ్మారి వ్యాప్తిని కట్టడి చేయడానికి ధర్నా అనుమతికి నిరాకరించామని డీసీపీ(న్యూఢిల్లీ) ఎయిష్ సింఘాల్ తెలిపారు. ఎల్జీ అనిల్ బైజాల్‌ను అభ్యర్థించినా అపాయింట్‌మెంట్ లభించలేదని, ఎల్జీని వెనుకుండి రక్షించేది ఎవరు? అని అతీషి ప్రశ్నించారు. బీజేపీ , మరికొందరు నేతలు, మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్ సహా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇంటి ముందు వారం రోజులుగా ధర్నా చేస్తున్నారని, సెక్షన్ 144, కరోనా నిబంధనలు వారికి వర్తించవా? అని రాఘవ్ చద్దా ప్రశ్నించారు.

Advertisement

Next Story

Most Viewed