వృద్ధుల కోసం ‘ఆలన’

by Aamani |
వృద్ధుల కోసం ‘ఆలన’
X

దిశ, నిర్మల్: దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వృద్ధులకు అవసరమైన ప్రత్యేక చికిత్స అందించేందుకు ఆలన వాహనాలు ప్రారంభించామని జిల్లా కలెక్టర్ ముషర్రఫ్ ఫారూఖీ తెలిపారు. గురువారం కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఆలన వాహనాన్ని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ ఇంటిపట్టునే ఉంటున్న వయోవృద్ధులకు జిల్లా ఆసుపత్రిలో చికిత్స అందించేందుకు ఆలన వాహనాలను అందుబాటులోకి తెచ్చామన్నారు. వాహనంలో డాక్టర్‌తో పాటు ఏఎన్ఎం, సిబ్బంది ఉంటారని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రతి గ్రామంలో పక్షవాతం, టీబీ వంటి ఇతర దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న వారిని గుర్తించి జిల్లా ఆసుపత్రికి తరలిస్తామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.వసంత్ రావు, డా.కార్తీక్, మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed