దేవరకద్రలో ఆడపిల్లలకు ఇబ్బందులు.. అసెంబ్లీ సాక్షిగా చెప్పిన ఎమ్మెల్యే

by Shyam |
దేవరకద్రలో ఆడపిల్లలకు ఇబ్బందులు.. అసెంబ్లీ సాక్షిగా చెప్పిన ఎమ్మెల్యే
X

దిశ ప్రతినిధి, మహబూబ్‎నగర్: ‘దేవరకద్రలో డిగ్రీ కళాశాల లేక చాలామంది ఆడపిల్లలు చదువులకు దూరం అవుతున్నారు.. మరి కొంతమంది ఇబ్బందులు పడుతూ మహబూబ్‌నగర్ వెళ్లి చదువుకోవాల్సి వస్తుంది. విద్యార్థుల ఇబ్బందులను గుర్తించి వెంటనే డిగ్రీ కళాశాలను మంజూరు చేయాలి’ అంటూ దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి అసెంబ్లీ సమావేశంలో ప్రస్తావించారు. శుక్రవారం జరిగిన సమావేశాలలో భాగంగా ఆయన జీరో అవర్‌లో మాట్లాడారు. కళాశాల మంజూరు చేయాలని ఉందని గత మూడు సంవత్సరాల నుంచి ప్రజల విజ్ఞప్తి మేరకు సమావేశాల్లోనూ ప్రస్తావించానని ఎమ్మెల్యే గుర్తు చేశారు. ఈ నేపథ్యంలోనే దేవరకద్రకు డిగ్రీ కళాశాల, చిన్నచింతకుంట మండల కేంద్రంలో జూనియర్ కళాశాల, అడ్డాకుల మండల కేంద్రంలో కేజీబీవీ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే సభలో ప్రస్తావించారు. ఈ మేరకు సంబంధిత విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందిస్తూ.. ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి డిగ్రీ, జూనియర్ కళాశాలలతో పాటు కేజీబీవీని మంజూరు చేయడానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

Advertisement
Next Story

Most Viewed