- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
40 పేజీల సినాప్సిస్ చదివి.. ఓకే చెప్పిన సూర్య
దిశ, వెబ్‌డెస్క్: సూర్య కథానాయకుడిగా సుధ కొంగర దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సూరరై పోట్రు’. తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా’ పేరుతో విడుదల కానుంది. ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్‌లో అక్టోబర్ 30న విడుదల చేయబోతున్నట్లు హీరో సూర్య ప్రకటించిన విషయం తెలిసిందే. ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడు జీఆర్ గోపీనాథ్ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. కాగా స్క్రిప్ట్ నుంచి స్క్రీన్ దశ వరకు తమ ప్రయాణాన్ని వివరిస్తూ ఈ మూవీ యూనిట్ ఓ వీడియోను విడుదల చేయడం విశేషం.
దర్శకురాలు సుధ కొంగర మాట్లాడుతూ.. ‘పదేళ్ల క్రితం కెప్టెన్ గోపీనాథ్ ఇంటర్వ్యూ చూశాను. ‘సింప్లీ ఫ్లై’ బుక్ చదివి ఆశ్చర్యపోయాను. ఆ పుస్తకం ఆధారం ఒక కథను రాసుకున్నాను. సూర్యను కలిసిన సమయంలో మీకు సూట్ అవుతుందో లేదో నాకు తెలియదు కానీ ఒకసారి ఈ కథ చదవమంటూ సినాప్సిస్ అందించాను’ అని సుధ కొంగర చెప్పింది. కాగా ‘40 పేజీల కథను దర్శకురాలు సుధ నాకు పంపించారు. కథ చదివి చాలా ఇంప్రెస్ అయ్యాను. ఒక మనిషి జీవితంలో ఇన్ని ఎత్తు పల్లాలు ఉండటం అంటే నిజంగా అద్బుతం. ఓ ఆర్డినరీ స్కూల్ టీచర్ కొడుకు గోపినాథ్. ఆయన ఒక్కడే ఓ ఎయిర్‌లైన్ స్థాపించడం నిజంగా గ్రేట్. కథ నచ్చడంతో.. కచ్చితంగా ఈ సినిమా చేద్దామని సుధతో చెప్పాను’ అని సూర్య తెలిపారు. ఇక సినిమాలో కాస్ట్ అందరూ కూడా స్ట్క్రిప్ట్ రీడింగ్ సెషన్స్‌లో పాల్గొన్నారు. అపర్ణ బాల మురళి హీరోయిన్‌గా నటించారు. మోహన్‌బాబు, జాకిష్రాఫ్, పరేశ్ రావల్, సంపత్ రాజ్ తదితరులు ఇందులో కీలక పాత్రలో నటించారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించారు.