ఆమె లైవ్‌లోనే… లైవ్ సీఫుడ్ తినేస్తోంది!

by vinod kumar |
ఆమె లైవ్‌లోనే… లైవ్ సీఫుడ్ తినేస్తోంది!
X

దిశ, వెబ్‌డెస్క్:
కరోనా వైరస్ ఎలా ప్రబలింది? చైనా ల్యాబ్‌లో తయారైందా? లేదా చైనీయులు తినే తిండి వల్ల వచ్చిందా? అనే చర్చ ప్రపంచమంతా నడుస్తోంది. అయితే.. కరోనా ప్రబలిన నాటి నుంచి చైనీయుల తినే ఆహారపు అలవాట్లపై తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి. చైనీ మీట్ మార్కెట్‌ను మూసి వేయాలని చాలామంది ప్రజలు కోరుతున్నారు. చైనాలోని కొన్ని నగరాల్లో ఇప్పటికే కుక్కలు, పిల్లులు తినవద్దంటూ అధికార యంత్రాంగాలు ఆదేశాలు కూడా జారీ చేశాయి. అయితే ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకంటారా.. ఓ యూ ట్యూబర్ …. లైవ్‌లోనే లైవ్ సీ ఫుడ్ తిని .. చాలా పాపులర్ అయ్యింది. ఇప్పుడు ఆమె ఎన్నో విమర్శలు ఎదుర్కొంటోంది.

సౌత్ కొరియాకు చెందిన 30 ఏళ్ల స్సోయంగ్ .. కేవలం తినడం వల్లే యూట్యూబ్ లో ఫేమస్ అయ్యింది. 16 నెలల్లోనే ఆమె యూ ట్యూబ్ చానల్ ను 3.4 మిలియన్ పీపుల్ ఫాలో అవుతున్నారంటేనే అర్థం చేసుకోవచ్చు..

ఇంతకీ ఆమె ఏం తింటుందంటే?

సీ ఫుడ్, డిజర్ట్స్, హాట్ చీటోస్.. కొన్ని సార్లు ప్రాణమున్న సముద్రపు జీవుల్ని తింటూ వీడియో చేస్తోంది. దాంతో ఆమె చానల్ కు ఫాలోయింగ్ బాగా పెరిగింది. ‘డాన్సింగ్ లైవ్ స్వ్కిడ్ ’ అనే వీడియోకు 24 మిలియన్ వ్యూస్ వచ్చాయి. స్వ్కిడ్ చూడటానికి ఆక్టోపస్‌ను పోలీ ఉంటుంది. ఇది ఒకరకమైన సముద్రపుజీవి. సియోల్, సౌత్ కొరియాల్లో లైవ్‌ఫుడ్ తినడం నేరం కాదు. ఎందుకంటే అక్కడ చాలా రెస్టారెంట్లలో లైవ్ ఆక్టోపస్ డిష్ ప్రిపేర్ చేస్తారు. కానీ స్సోయంగ్ చాలా దారుణంగా వాటిని తింటోంది. ఆమె అలా తింటూ ఉన్న సౌండ్ .. వీక్షకులు వినడానికి వీలుగా స్పీకర్లు యూజ్ చేసింది. క్లెన్ ఆనే యూట్యుబర్ ఆమె వీడియోలన్నింటినీ కలిపి ఓ వీడియోను చేశాడు. ఆమె పై తీవ్రంగా విమర్శలు చేశాడు. ‘స్సోయంగ్ కు జంతువులను హింసించి తినడమంటే ఇష్టం’ అని కామెంట్ పెట్టాడు. జంతువులను ఆమె ఇంతలా టార్చర్ చేసి చంపుతుంటే.. యూ ట్యూబ్ ఆ వీడియోలను ఎలా అనుమతిస్తుంది? అని మరో యూట్యూబర్ కామెంట్ చేశాడు. ఆమె వీడియోలను యూ ట్యూబ్ నుంచి తొలగించాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ‘ఆమె సౌత్ కొరియాకు చెందిన సిటిజన్. అక్కడి ఆహారపు అలవాట్లను ఆమె రిప్రెజెంట్ చేస్తోంది. అందులో తప్పు లేదు. కొరియన్లు కాకుండా వేరే ప్రజలకు కొంతమంది ఇది నచ్చవచ్చు. మరి కొంతమందికి నచ్చకపోవచ్చు. అయినప్పటికీ వచ్చిన విమర్శలను దృష్టిలో పెట్టుకుని మేము ఆమెతో మాట్లాడతాం’ అని యూట్యూబ్ స్పోక్స్ పర్సన్ తెలిపారు.

Tags: ssangyong, south korea, youtuber, eat, live food, seafood, mukbang

Advertisement

Next Story