- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
కడుపులో కత్తితో రోడ్డుపై పరుగులు తీసిన యువకుడు

X
దిశ, వెబ్‌డెస్క్ : పాత కక్ష్యల నేపథ్యంలో కొందరు దుండగులు ఓ వ్యక్తిపై హత్యాయత్నం చేశారు. కత్తులతో వెంబడించి దాడి చేశారు. అయితే వ్యక్తి కత్తిపోట్లకు గురైనా ప్రాణాలు కాపాడుకోవడానికి పరుగు తీశాడు. అలా కడుపులో కత్తి పెట్టుకునే పోలీస్ స్టేషన్ వరకు వెళ్లి ప్రాణాలు నిలుపుకున్నాడు.
మహారాష్ట్రలోని నాగపూర్ పోలీస్ స్టేషన్‌కు అర కిలోమీటర్ దూరంలో ఓ 20 ఏళ్ల యువకుడిపై 9 మంది నడీరోడ్డుపై కత్తులతో దాడి చేశారు. ఆ సమయంలో ఒకరు పొడిచిన కత్తి కడుపులోనే ఉండిపోయింది. అయినా యువకుడు వారి నుంచి తప్పించుకుని పరుగు అందుకున్నాడు. అదే సమయంలో అటుగా వచ్చిన అతడి స్నేహితుడు బైక్ పై లిఫ్ట్ ఇవ్వడంతో కడుపులో కత్తితోనే పోలీస్ స్టేషన్ లోకి వెళ్లాడు. వెంటనే గమనించిన పోలీసులు యువకుడిని ఆస్పత్రికి తరలించారు. దాడికి పాల్పడిన 9 మందిని అదుపులోకి తీసుకున్నారు.
Next Story