- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
నదిలో దూకి మహిళ ఆత్మహత్య
by Sridhar Babu |
X
దిశ, జగిత్యాల: అనారోగ్య సమస్యల కారణంగా ఓ మహిళ నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం రాయపట్నం వద్ద గురువారం చోటుచేసుకుంది. స్థానిక ఎస్‌ఐ శ్రీకాంత్ వివరాల ప్రకారం… ధర్మపురి పట్టణానికి చెందిన గడిపెల్లి భారతి అలియాస్ బిందు(42) గతకొంత కాలంగా బ్లాడర్ ఇన్ఫెక్షన్ సమస్యతో తీవ్రంగా బాధపడుతోంది.
ఈ క్రమంలో గురువారం రాయపట్నం గోదావరి నది వద్ద, వంతెన పైనుంచి నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. గమనించిన జాలర్లు రక్షించేందుకు ఘటనా స్థలానికి చేరుకున్నప్పటికీ అప్పటికే మహిళ గల్లంతైంది. విషయం తెలుసుకున్న ఎస్సై సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని వెలికితీయించారు. మృతురాలికి భర్త, ఒక కూతురు ఉన్నారు. భర్త సత్యనారాయణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisement
Next Story