ఘోరం.. రెండేళ్ల బాలుడ్ని పంటితో ఈడ్చుకెళ్లిన కుక్క

by Aamani |
two-year-old boy
X

దిశ, బాసర: ఆదిలాబాద్ జిల్లా బాసర మండల కేంద్రంలోని ఓని గ్రామంలో సోమవారం పిచ్చికుక్కలు బీభత్సం సృష్టించాయి. రెండేళ్ల బాలుడిపై దాడిచేసి దారుణంగా కరిచాయి. మరీ ముఖ్యంగా గ్రామానికి చెందిన చిన్నారి అబ్బువార్(2)ని కుక్క ఏకంగా పంటితో బిగ్గరగా పట్టుకొని ఈడ్చుకెళ్లాయి. దీంతో బాలుడికి తీవ్రగాయాలు అయ్యాయి. స్థానికులు గమనించి కుక్కను తరిమివేయడంతో ప్రాణపాయం తప్పింది. బాలుడి ముఖంపై రెండు కాట్లు పడటమే కాకుండా, బాలుని రెండు పళ్లు ఉడిపోయయి. దీంతో వెంటనే బాసర ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మెరుగైన చికిత్స కోసం జిల్లా ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. బాలుడితో పాటు ఇద్దరు మహిళలు రుక్మబాయి, పుష్పబాయిలకు బాబును కుక్క బారినుంచి కాపాడబోయే క్రమంలో కాటు వేశాయి. దీంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు.

Advertisement

Next Story