- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఏపీ బీజేపీ చీఫ్ కన్నా ఇంట్లో విషాదం

దిశ, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. ఆయన చిన్న కుమారుడు ఫణేంద్ర భార్య నల్లపురెడ్డి సుహారిక అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మీనాక్షి టవర్స్‌లో గురువారం సాయంత్రం ఆమె ఆత్మహత్యాయత్నం చేసుకున్నట్లు తెలిసింది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు హుటాహుటిన రాయదుర్గంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న మాదాపూర్ పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఆమె మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. కోడలు మృతితో కన్నా లక్ష్మీనారాయణ కుటుంబంలో విషాదఛాయలు అలుములుకున్నాయి. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.