- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అర్థరాత్రి రోడ్డుపై దాన్ని చూసి షాకైన ఆదివాసీలు
దిశ, అచ్చంపేట : నాగర్ కర్నూల్ జిల్లాలోని నల్లమల ప్రాంతం ఏటీఆర్ అడవుల్లో బుధవారం రాత్రి శ్రీశైలం జాతీయ రహదారిపై ఆదివాసీ గిరిజనులకు పెద్దపులి తారస పడింది. వారు తెలిపిన సమాచారం మేరకు అటవీ ప్రాంతంలో ఉంటున్న ఆదివాసీ గిరిజనులు తమ అవసరాల నిమిత్తం పట్టణ ప్రాంతాలకి వచ్చి తిరిగి వెళుతున్న క్రమంలో నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండల మన్న నూరు రేంజ్ పరిధిలో గల హైదరాబాద్ శ్రీశైలం జాతీయ రహదారి వద్ద పెద్దపులి తారస పడిందని తెలిపారు. పెద్ద పులి ని చూసి వాహనంలో వెళుతున్నా గిరిజనులు తమ వాహనాన్ని దూరంగా ఆపుకొని పెద్దపులి రోడ్డు దాటి వెళ్ళిపోయిన తర్వాత మా గమ్యానికి చేరుకున్నామని తెలిపారు.
తన నివాసంలో పెద్ద పులి సంచారం సహజమే..
ఆసియా ఖండంలోనే అతిపెద్ద రిజల్ట్ ప్రాంతంగా గుర్తింపు పొందిన అమ్రాబాద్ రిజర్వు టైగర్ అటవీ ప్రాంతం పెద్దపులుల ఆవాసానికి నిలయం. రాత్రి సమయంలో శ్రీశైలం జాతీయ రహదారులు నిర్మానుష్యంగా ఉంటాయి. ఈ నేపథ్యంలో తన ఆవాసంలో పెద్దపులి రాత్రివేళల్లో సంచారం చేయడం సహజమే.
- Tags
- Amrabad