భారతమాతకు గుడి.. ప్రతిఏటా ఉత్సవాలు

by  |
భారతమాతకు గుడి.. ప్రతిఏటా ఉత్సవాలు
X

దిశ, వెబ్‌డెస్క్: సాధారంగా ఎక్కడైనా దేవుళ్లకు మాత్రమే గుడి కడతారు. కానీ ఓ మాత్రం ప్రత్యేకంగా భారత మాతకు గుడి కట్టి, ప్రతిఏటా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండ‌ల కేంద్రంలో 1950లో ఈ ఆలయాన్ని నిర్మించారు. పిస్క లక్ష్మయ్య అనే స్వాతంత్య్ర సమరయోధుడు మొదట ఓ గుడిసెలో విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు. ఆ తర్వాత నక్క రామన్న, బుర్రి గంగారాం సహకారంతో మందిర నిర్మాణాన్ని మొదలుపెట్టారు. ఇందుకు కావాల్సిన స్థలాన్ని ఇచ్చేందుకు దాతలు ముందుకొచ్చారు. 1982లో ఇక్కడ నవగ్రహాలను పలు దేవతా విగ్రహాలను కూడా ప్రతిష్టించారు.

ప్రతిరోజూ దీప ధూప నైవేద్యాలు సమర్పించేందుకు పూజారిని కూడా నియమించారు. ప్రతి ఏటా మార్గశిర శుక్ల షష్ఠి రోజున భరతమాత జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారు. చుట్టుపక్కల గ్రామాల నుంచే కాకుండా పొరుగున ఉన్న మహారాష్ట్ర, కర్ణాటకల నుంచి కూడా భక్తులు తరలివస్తారు. దేశ గొప్పదనాన్ని చాటి చెప్పేందుకు ఈ ఆలయం నిర్మించినట్టు చెబుతున్నారు. ప్రభుత్వం నిధులు కేటాయించి ఆలయాన్ని మరింత అభివృద్ధి చేయాలని వారు కోరుతున్నారు.



Next Story