‘ఫిబ్రవరిలో స్థానిక ఎన్నికలు సాధ్యం కాదు’

by srinivas |
‘ఫిబ్రవరిలో స్థానిక ఎన్నికలు సాధ్యం కాదు’
X

దిశ, ఏపీ బ్యూరో: ఫిబ్రబరిలో స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని అధికారుల బృందం వెల్లడించింది. శుక్రవారం సాయంత్రం ఎస్​ఈసీ నిమ్మగడ్డ ప్రసాద్‌తో సీఎస్​ ఆదిత్యనాథ్ దాస్, పంచాయతీరాజ్, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శుల బృందం సమావేశమైంది. గంటన్నరపాటు చర్చ కొనసాగింది. కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ కారణంగా ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని సీఎస్‌ బృందం వెల్లడించింది. కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ముగిసే వరకు ఎన్నికలు వాయిదా వేయాలని కోరారు. గతంలో రాష్ర్ట ఎన్నికల సంఘం స్థానిక ఎన్నికల నిర్వహణకు ప్రొసీడింగ్స్​ఇచ్చింది. కరోనా వల్ల ఎన్నికలు నిర్వహించలేమని రాష్ర్ట ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. ఈ వివాదానికి ముగింపు పలుకుతూ ప్రభుత్వం నుంచి ముగ్గురు ప్రిన్సిపల్​సెక్రటరీ హోదా కలిగిన అధికారులు ఎస్​ఈసీతో చర్చించాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఆమేరకు సీఎస్​ బృందం ఎస్ఈసీతో చర్చించింది.

కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ఈ నెలలో ప్రారంభిస్తున్నట్లు ఎస్​ఈసీ దృష్టికి తీసుకొచ్చారు. రాష్ట్రంలో ఇప్పటికే రెండుసార్లు వ్యాక్సినేషన్‌ డ్రైరన్‌ నిర్వహించినట్లు పేర్కొన్నారు. తొలి విడతగా కోటిమందికి వ్యాక్సినేషన్‌ వేయాల్సి ఉందన్నారు. 5 కోట్ల మందికి రెండు డోసుల చొప్పున వ్యాక్సినేషన్‌ వేయాలంటే 6 నుంచి 8 నెలల సమయం పడుతుందని సీఎస్‌ బృందం తెలిపింది. రాష్ట్రంలోని ప్రభుత్వ యంత్రాంగమంతా వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో ఉన్నట్లు వెల్లడించారు. వలంటీర్ల నుంచి రాష్ట్ర స్థాయి అధికారుల వరకు వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో విధుల్లో ఉండాల్సిన అవసరముందని సీఎస్‌ వివరించారు.

Advertisement

Next Story

Most Viewed