- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
హుంస్సాలో వింత ఆచారం.. హోళీ రోజు ఏం చేస్తారంటే?
దిశ బోధన్: నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం హుంస్సా గ్రామంలో ప్రతి ఏడాది హోలీ రోజున వింత ఆచారం పాటిస్తారు. గ్రామం నడిబొడ్డున హోలీ సందర్భంగా పిడిగుద్దులాట నిర్వహిస్తారు. గ్రామం సుభిక్షంగా ఉండాలని 30 ఏళ్ల నుంచి ఈ పిడిగుద్దులాట ఆచారాన్ని కొనసాగిస్తున్నామని గ్రామస్తులు తెలుపుతున్నారు. ఇందుకోసం హంస్సా హనుమాన్ మందిరం వద్ద పిడిగుద్దులాట వేదిక ఏర్పాటు చేస్తారు. రెండు వర్గాలుగా విడిపోయి ఒకరినొకరు 20 నిమిషాల పాటు కొట్టుకుంటారు. తర్వాత ఆలింగనం చేసుకుంటారు. ఈ పిడిగుద్దులాట వీక్షించడానికి మహారాష్ట్ర పరిసర ప్రాంతాల ప్రజలు పెద్ద ఎత్తున వచ్చి వీక్షిస్తారు. ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా పోలీసులు సైతం భారీ బందోబస్తు నిర్వహిస్తారు. హుంస్సాలో పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారమని దీనిని నిర్వహించకుంటే గ్రామానికి అరిష్టం కలుగుతుందని గ్రామస్తులు తెలిపారు. పిడిగుద్దులాట హొలీ రోజు మధ్యాహ్నం కుస్తీ పోటీలు నిర్వహించిన తర్వాత సాయంత్రం 6 గంటలకు పిడిగుద్దులాట ఉంటుంది.