- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
నాపరాయి బండ మీద పడి వ్యక్తి మృతి
by Shyam |

X
దిశ, కోదాడ: ఇంటి నిర్మాణ పనుల్లో భాగంగా పనులు నిర్వహిస్తుండగా ప్రమాదవశాత్తు నాపరాయి బండ విరిగి మీద పడి ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన నల్లగొండ జిల్లా కోదాడ మండల పరిధిలోని అమీనాబాద్ గ్రామంలో చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే.. గ్రామానికి చెందిన బియ్యాల కోటయ్య(50) నూతనంగా నిర్మించిన ఇంటికి లోపలి భాగంలో పైన ఇనుప కడ్డీని అమర్చే పనిలో భాగంగా సుతార్ మేస్త్రి అంజయ్య మధ్య భాగంలో ఉన్న నాపరాయి మీద ఎక్కి పైన పనులు నిర్వహిస్తుండగా ఆయన బరువుకి నాపరాయి విరిగిపడి కింద ఉన్న బియ్యాల కోటయ్యపైన పడింది. దీంతో కోటయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. మృతునికి భార్యా, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. విషయం తెలిసిన కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.
Next Story