- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
నాయకత్వ లక్షణాలను పెంచేందుకు గీతంలో ప్రత్యేక విభాగం
దిశ, పటాన్ చెరు: వృత్తి విద్యా కోర్సులలో నైపుణ్యాభివృద్ధితో పాటు సామాజిక బాధ్యతను గుర్తు చేయడం, నాయకత్వ లక్షణాలను పెంచడమే లక్ష్యంగా గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో నూతనంగా గీతం ఫ్యూచర్ లీడర్స్ డవలప్ మెంట్ ప్రోగ్రాం (జి.ఎఫ్.ఎల్.డి.పి ) పేరిట సరికొత్త కార్యక్రమం బుధవారం ప్రారంభమైంది. గీతం ఏర్పాటు చేసిన వెబ్ నార్ లో ప్రముఖ ఐటి సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్) ఉపాధ్యక్షుడు, సంస్థ అమెరికాలోని గ్లోబల్ డెలివరీ సెంటర్ అధిపతి దామెాదర్ పాడి ముఖ్య అతిధిగా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రాంగణ నియామకాలకు సిద్దం అయ్యేవారు డ్రీమ్ కంపెనీ, డ్రీమ్ జాబ్ అంటూ పరిధులు విధించుకోకూడదన్నారు. ఎలాంటి సంస్థలో అవకాశం లభించినా పూర్తి సామర్థ్యంతో, అంకిత భావంతో పనిచేయడం జీవితంలో ఉన్నత స్థానాలకు ఎదగడానికి ఉపయోగ పడుతుందన్నారు. మారుమూల విద్యుత్ సౌకర్యం కూడా లేని గ్రామం నుంచి మాతృభాష ఒరియాలో విద్యాభ్యాసం చేసిన తనకు జీవితంలో ఎదురైన అనుభవాలను ఆయన వివరించారు. జీవితంలో నిరంతర అభ్యాసం, చుట్టూ ఉన్న వారితో స్నేహపూర్వక భావన, ప్రతికూల పరిస్థితుల నుంచి పాఠాలను నేర్చుకోవడం నాయకత్వ లక్షణాలన్నారు.
గీతం చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ ఎన్.క్రిష్ మాట్లాడుతూ.. గీతం నుంచి ఏటా 3000 వేల మంది ఉద్యోగాలు సాధిస్తున్నారని, ఐతే కెరీర్ పరంగా ఎదగాలంటే ఉద్యోగ సాధన ఒక్కటే లక్ష్యం కాకూడదన్నారు. బృందంగా అందరితో కలిసి నడిపించే నాయకత్వ లక్షణాలు యువతకు అవసరమని గుర్తించి ఈ ప్రత్యేక కార్యక్రమం రూపొందించామన్నారు. గీతం కెరీర్ గైడెన్స్ విభాగం డీన్ కమాండర్ గురుమూర్తి గంగాధరన్ మాట్లాడుతూ.. కాలానుగుణంగా ప్రాంగణ నియామకాలు నిర్హించే కంపెనీల ప్రాధాన్యతలు మారుతున్నాయన్నారు. విద్యార్థులలో విషయ పరిజ్జానంతో పాటు వ్యక్తిత్వం, నాయకత్వ లక్షణాలు, నేర్చుకోవాలన్న తపన పరిశీలిస్తున్నారని తెలిపారు. ఈ దృష్ట్యా గీతం కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని తెలిపారు. ఆన్ లైన్ లో జరిగిన ఈ కార్యక్రమానికి దేశంలోని వివిధ రాష్ట్రాలలో గల గీతం విద్యార్థులు పెద్ద ఎత్తున హజరయ్యారు.