పాఠశాలలో హుండీ ప్రత్యక్షం.. బెంబేలెత్తుతున్న జనం

by Sumithra |   ( Updated:2021-11-23 11:30:40.0  )
arvapalli
X

దిశ, అర్వపల్లి: మండల పరిధిలోని పలు గ్రామాలలోని దేవాలయాల్లో దొంగలు వరుసగా హుండీలను ఎత్తుకెళ్తున్న ఘటనలు మండల వ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. గత నెల రోజుల క్రితం జాజిరెడ్డిగూడెం గ్రామంలోని 4 దేవాలయాలలోని హుండీలను పగులగొట్టి నగదు దోచుకెళ్లిన సంఘటన మరువకముందే మంగళవారం మరో సంఘటన వెలుగులోకి వచ్చింది.

మండల పరిధిలోని కాసర్లపహాడ్ గ్రామంలోని శివాలయం, ఆంజనేయస్వామి ఆలయాలలో ఉన్న హుండీలలోని నగదును సోమవారం అర్ధరాత్రి దొంగలు ఎత్తుకెళ్లారు. ఆంజనేయస్వామి ఆలయంలో ఉన్న హుండీని ఎత్తుకెళ్లి అందులోని నగదును తీసుకుని, ఆ తర్వాత హుండీని దేవాలయం పక్కనే ఉన్న పాఠశాల ఆవరణలో పడేశారు. హుండీలలో సుమారు రూ.5 నుండి 10 వేల వరకు నగదు ఉంటుందని గ్రామస్తులు తెలిపారు. మండలంలోని పలు ఆలయాల్లో వరుసగా దొంగతనాలు జరుగుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. హుండీలను చోరీ చేసిన దుండగులను గుర్తించి, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.


👉 Follow us on WhatsApp Channel
👉 Follow us on Sharechat


Next Story