ఈ పూజారి స్టైలే వేరు.. చూస్తే షాకే

by Aamani |
ఈ పూజారి స్టైలే వేరు.. చూస్తే షాకే
X

దిశ,బోథ్: ఇప్పుడు అందరి మదిలో ఒకటే పదం కరోనా..కరోనా.. కరోనా కోసం ఎంతోమంది ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ మధ్య కొందరు డబుల్ మాస్క్ ధరిస్తున్నారు కొందరు జేబులో శానిటైజర్ పెట్టుకొని మాటిమాటికీ పెట్టుకుంటున్నారు. కొందరు మాత్రం మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

అయితే ఈ నేపథ్యంలో ఒక దుకాణం ప్రారంభించడానికి వచ్చిన పూజరి తీసుకున్న జాగ్రత్తలు చూస్తే అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. కొంత మంది నవ్వుకున్నారు. కరోనా కోసం జాగ్రత్తలు తీసుకుంటే నవ్వడం ఏంటీ అనుకుటున్నారా.. అయితే జిల్లాలోని ఓ వ్యాపారి కొత్తగా షాప్ ఓపెన్ చేస్తున్నాడు. అయితే ఆ షాప్ ప్రారంభోత్సవానికి పూజచేయడానికి వచ్చిన పూజారి హెల్మెట్ పెట్టుకొని పూజ నిర్వహించారు. దీంతో అందరూ కరోనా బారిన పడకుండా ఇంత జాగ్రతగా తీసుకోవడం బాగుందని స్థానికులు అన్నారు .

Advertisement

Next Story