- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అన్నదాత జీవనోపాధిని లాగేసుకున్న చెరువు..
దిశ, ఖమ్మం రూరల్ : ప్రమాదవశాత్తు చెరువులో పడి నాలుగు గేదెలు మృత్యువాత పడిన ఘటన ఖమ్మం రూరల్ మండలంలో బుధవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. మండలంలోని ఆరెకోడు గ్రామానికి చెందిన మంద వీరభద్రం అనే వ్యక్తి తనకు ఉన్న గేదెలతో పాల వ్యాపారం చేస్తుండేవాడు. రోజు లాగానే వీరభద్రం ఈరోజు కూడా తనకు ఉన్న పది గేదెలను మేతకు తీసుకెళ్లాడు. గేదెలు ఎటు వెళ్లకుండా ఒకదానికొకటి కలిపి జాయింట్‌గా ఒకే తాడు కట్టాడు.
అయితే, నీళ్లు తాగేందుకు చెరువులోకి గేదెలు దిగాయి. ఈ క్రమంలో గేదెలు ఒకదానికొకటి సంబంధం లేకుండా ముందుకు వెళ్లడంతో వాటి మెడకు అమర్చిన ఒకే తాడు బిగుసుకుంది. దీంతో ఊపిరాడక నాలుగు గేదెలు ప్రమాదవశాత్తు మరణించాయి. గేదెల ద్వారా లభించే పాలతోనే బాధిత రైతు వీరభద్రం వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అనుకోకుండా గేదెలు మరణించడంతో ఆ రైతు కన్నీరుమున్నీరుగా విలపించాడు. బాధిత రైతును ఆదుకోవాలని గ్రామ సర్పంచ్ఉప్పుగండ్ల వెంకటనారాయణ ప్రభుత్వాన్ని కోరతానని చెప్పినట్టు తెలుస్తోంది.