- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాంపౌండర్.. రికార్డ్స్‌లో చీటర్ !
దిశ, కరీంనగర్:
ఇంటర్మీడియట్ బోర్డు చరిత్రలోనే అరుదైన రికార్డు.. నిజమైన రికార్డు కాదు గానీ.. ఓ రకంగా ఇదీ రికార్డే..! ఎలాగంటారా ? ఓ వ్యక్తి ఏకకాలంలో మూడు చోట్ల చదివినట్టు సర్టిఫికెట్లు సృష్టించి, ఆయుష్ విభాగంలో 11 ఏండ్లుగా ఔట్‌సోర్సింగ్ ఉద్యోగం వెలగబెట్టడం.. అందుకు సంబంధిత విభాగం జై కొట్టడం.. రికార్డే కదా ! అంతేనా.. నకిలీ సర్టిఫికెట్ల బాగోతం బయటపడగానే కటకటాల పాలు కావల్సిన ఆ వ్యక్తిని.. ఆయుష్ విభాగం కంటికి రెప్పలా కాపాడుతుండటం మరో రికార్డు.
కరీంనగర్ సమీపంలోని కొత్తపల్లి ఆయుష్ ఆసుపత్రిలో కాంపౌండర్‌గా విధులు నిర్వర్తిస్తున్న పులిపాక విద్యాసాగర్ 1995లో కరీంనగర్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో ఇంటర్ హిస్టరీ సబ్జెక్టులో చదివి ఫెయిల్ అయ్యాడు. ఆ తరువాత సైన్స్ సబ్జెక్ట్‌లో ఫస్ట్ క్లాస్‌లో పాసైనట్టు ఇంటర్ బోర్డు మెమో పొంది ఆయుష్ విభాగంలో దరఖాస్తు చేసుకుని ఔట్ సోర్సింగ్ ఉద్యోగం పొందారు. 11 ఏండ్ల కిందట కాంపౌండర్‌గా ఉద్యోగం సంపాదించిన విద్యాసాగర్ విషయం తాజాగా బయటకు పొక్కింది. దీంతో ఆయన ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర మాధ్యమిక పరిషత్ విద్యా విభాగంలో 1995లోనే ఫస్ట్ క్లాస్‌లో పాసైనట్టు మరో సర్టిఫికెట్‌ను డిపార్ట్‌మెంట్‌కు అప్పగించారు. దీంతో అతన్ని యథావిధిగా విధుల్లో కొనసాగిస్తున్నారు. విద్యాసాగర్ 1995లోనే మూడు చోట్ల విద్యనభ్యసించినట్టు సర్టిఫికెట్లు అందించినా ఆయుష్ విభాగం అధికారులు పట్టించుకోకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. అయితే ఓ సామాజిక కార్యకర్త సమాచార హక్కు చట్టం ద్వారా అసలు విషయాన్ని వెలుగులోకి తేవడంతో అసలు నిజాలు బయటపడ్డాయి. అయినప్పటికీ అధికారులు మాత్రం అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం లేదు సరికదా.. ఉద్యోగం నుంచి కూడా తీసేయడం లేదు. తప్పు చేసిన వ్యక్తిని కాపాడేందుకు ఆయుష్ అధికారులు ఎందుకు ప్రయత్నిస్తున్నారో వారికే తెలియాలి. కాగా ఈ విషయంపై సమగ్రంగా విచారిస్తే మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.
tags : Compounder, fake certificates, Intermediate, Ayush, RTI