మంచి కోతి అనుకుంటే ఇంత పనిచేసిందా ?

by Sridhar Babu |   ( Updated:2024-02-03 13:20:40.0  )
మంచి కోతి అనుకుంటే ఇంత పనిచేసిందా ?
X

దిశ, షాద్ నగర్: రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలపరిధిలోని ఎక్లాస్ ఖాన్ పేట గ్రామంలో ఓ కోతి గత ఆరునెలలుగా హల్ చల్ చేస్తోందని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాల ఆవరణలోని చెట్లపై ఆవాసం ఏర్పాటు చేసుకుంది. తరచూ గ్రామంలోని ఇళ్లలోకి చొరబడి తినుబండారాలను ఎత్తుకెళ్లి తినేది. మొదట్లో కోతిని చూసి సరదాపడ్డ ప్రజలు ఇప్పుడు దాన్ని చూస్తేనే జంకుతున్నారు. గత మూడునెలలుగా అడ్డువచ్చిన వారిపై దాడికి పాల్పడుతోంది. దీంతో గ్రామంలో ఇప్పటివరకు 10మంది పిల్లలు గాయప‌డ్డారు. పాఠశాల ఆవరణలో మధ్యాహ్న భోజన సమయంలో కోతి విద్యార్థులపై దాడికి పాల్పడుతోందని గ్రామస్థులు తెలిపారు. ఇప్పటికైనా అటవీ అధికారులు స్పందించి కోతి బారి నుంచి తమను రక్షించాలని కోరుతున్నారు.



Next Story

Most Viewed