- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అన్నంకోసం మారం చేస్తున్న వానరం.. తప్పడంలేదంటున్న యజమాని
దిశ,మానకొండూరు: ఇంట్లో పెంపుడు జంతువులు ఉన్నాయంటే.. వాటికీ కరెక్ట్ టైమ్ కి భోజనం పెట్టాలి. ఒక్కరోజు టైమ్ కి భోజనం పెట్టకపోతే అవి చేసే మారం అంతా ఇంతా కాదు. ఇల్లంతా కలియతిరుగుతూ యజమానులు ఒక్కపని కూడా చేసుకోనివ్వవు. కానీ ఇక్కడ మనం చూస్తున్న ఓ వానరం మాత్రం.. రోజు ఓ ఇంటికి వెళ్లి ఆకలి అవుతుంది అన్నం పెట్టు.. అంటూ గదమాయిస్తుంది. అంతేకాదు తన చంటి బిడ్డతో కలిసి ఇంటి ముందు మారం చేస్తోంది. ఈ వింత ఘటన కేశపట్నం మండలంలోని మొలంగూర్ గ్రామంలో చోటు చేసుకుంటుంది.
ఈ సందర్భంగా ఇంటి యజమాని దండు స్వరూప మాట్లాడుతూ.. ఓ కోతి నిత్యం తన బిడ్డతో కలిసి ఇంటి ముందుకు చేరి, అన్నం పెట్టే వరకు ఇంటి గోడలపై కూతలు పెడుతూ ఇంటి చుట్టూ తిరగడం మొదలు పెడుతుంది. దీంతో చేసేదేమీ లేక నా కూతుర్లు, నేను మూడు పూటలు అన్నం పెట్టాల్సిందే, లేదంటే మారం చేయడం జరుగుతుంది అని తెలిపింది. ఆ ఒక్క ఇంటి వద్ద తప్ప వేరే ఇంటికి కూడా వెళ్ళదంట ఈ వానరం. ఈ ఇంటికి పెంపుడు వానరంలా మారిపోయిందని గ్రామస్థులు తెలుపుతున్నారు.