పోలీస్ స్టేషన్‌లోనే కత్తులతో దాడి

దిశ, వెబ్‌డెస్క్: అందరికీ రక్షణ కల్పించాల్సిన పోలీసుల ఎదుటే దారుణ ఘటన జరిగింది. ఊహించని పరిణామంతో పోలీసులు సైతం ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. సాక్షాత్తు రక్షకభట నిలయంలోనే ఓ వ్యక్తిపై కొందరు దుండగులు కత్తులతో దాడి చేశారు. ఈ ఘటన శ్రీకాకులం జిల్లాలోని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో సోమవారం చోచుచేసుకుంది.

వివరాళ్లోకి వెళితే… ఓ మహిళకు అసభ్యకరంగా మెసేజ్‌లు పంపుతున్నాడన్న కారణంగా ఇమ్రాన్ అనే వ్యక్తిని పోలీసులు స్టేషన్‌కు పిలిపించారు. విషయం తెలిసిన మహిళ సోదరుడు స్టేషన్‌లో ఉన్న ఇమ్రాన్‌పై కొందరు వ్యక్తులతో వచ్చి కత్తులతో దాడి చేశారు. దీంతో ఒక్కసారిగా పోలీస్ స్టేషన్‌ ఉలిక్కిపడింది. ఇమ్రాన్ తల, చేతులకు తీవ్ర గాయాలు కావడంతో రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.

Advertisement